భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్‌కి రిటైరమెంట్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. దీంతో రోహిత్ స్థానంలో టెస్ట్ కెప్టెన్ రేసులో ఎవరు ఉన్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జస్ప్రీత్ బుమ్రా. వన్డే,టెస్ట్,టీ20 మూడు ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణిస్తున్న ఏకైక భారత ఆటగాడు. ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో గెలిచిన టెస్ట్ మ్యాచ్ బుమ్రా నాయకత్వంలోనే వచ్చింది. ఇక కెప్టెన్ రేసులో వినిపస్తున్న మరో పేరు రిషభ్ పంత్. వైట్ బాల్ ఫార్మాట్‌లో అంతగా ఆకట్టుకోకపోయినా, టెస్ట్ క్రికెట్‌లో రిషభ్ పంత్ మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు.
అలాగే కేఎల్ రాహుల్… అనేక జట్లకు కెప్టెన్సీ చేసిన రాహుల్ ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ, ఆ బాధ్యతను తిరస్కరించాడు. ఇప్పుడు అతను మళ్లీ కెప్టెన్సీ తీసుకోవాలన్న ఆసక్తి ఉందా అనే ప్రశ్న ఉంది. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో స్థిరంగా రాణించలేకపోయినా, అతని కెప్టెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తిరిగి జట్టులోకి రావడం ద్వారా అతనిలో ఉన్న కెప్టెన్సీ ప్రతిభను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. తాత్కాలికంగా బుమ్రా కెప్టెన్ చేస్తూ, అయ్యర్‌ను క్రమంగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో పూర్తి స్థాయి కెప్టెన్‌గా తీర్చిదిద్దవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read:TTD:ప్రైవేట్ వ్యక్తులకు భూములు కేటాయించం

