టీ20 వరల్డ్ కప్‌ టార్గెట్‌గా టీమిండియా!

5
- Advertisement -

డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఘనతను అందుకోవాలనే లక్ష్యంతో ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు బ్యాటింగ్‌లో అపారమైన ఫైర్‌పవర్‌తో పాటు బౌలింగ్‌లో విభిన్నత కలిగి ఉండటంతో బలమైన జట్టుగా భావించబడుతోంది.

టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత్ అద్భుతమైన విజయ పరంపర కొనసాగిస్తోంది. సూర్యకుమార్ సారథ్యంలో ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా భారీ స్కోర్లు నమోదు చేసింది. 2024 జూన్‌లో బార్బడోస్‌లో టీ20 కప్ గెలిచిన తర్వాత భారత్ 41 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 33 విజయాలు (రెండు సూపర్ ఓవర్ విజయాలు సహా) సాధించింది. కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలవగా, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్ మూడు చారిత్రక రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. ఈసారి కప్ గెలిస్తే, టీ20 ప్రపంచకప్‌ను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా, స్వదేశంలో టైటిల్ గెలిచిన తొలి జట్టుగా, మూడు సార్లు టీ20 కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఘనతలను ఏ జట్టూ సాధించలేదు.

భారత్, ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్ మాత్రమే ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్ గెలిచిన జట్లు. భారత్ 2007, 2024లో, వెస్ట్ ఇండీస్ 2012, 2016లో, న్యూజిలాండ్ 2010, 2022లో ప్రపంచకప్‌లు గెలిచాయి. అయితే ఏ జట్టూ మూడుసార్లు టైటిల్ గెలవలేదు.

ALso Read:Funky:‘ఫంకీ’ ట్రైలర్ అప్‌డేట్

ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉండాల్సి ఉంది. అయితే లీగ్ దశ మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించడంతో ఈ మ్యాచ్ అనిశ్చితిలో పడింది.లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.

- Advertisement -