ఇండియా బలం స్పిన్నా.. పేసా?

27
- Advertisement -

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే వరల్డ్ కప్ లో పాల్గొనే అన్నీ జట్లు భారత్ చేరుకున్నాయి. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లతో రాబోయే మ్యాచ్ లకు సన్నాహం అవుతున్నాయి. ఈ నెల 8 న వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది టీమిండియా. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన టీమిండియా అదే జోష్ ను తొలి మ్యాచ్ లో కూడా కొనసాగించాలని చూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ప్రస్తుతం అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, మిడిలార్డర్ లో ఇషన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, ఇలా నెంబర్ సిక్స్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. .

ఇక బౌలింగ్ లో కూడా ప్రస్తుతం జట్టు అత్యంత పటిష్టంగానే ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో ఉన్న మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక బుమ్రా, షమి, స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ తిరుగులేని ప్రదర్శన కదబరుస్తున్నాడు. ఇక స్పిన్ విషయానికొస్తే జడేజా, అశ్విన్, కుల్దీప్ స్పిన్ విభాగంలో కీలకంగా మారనున్నారు. గతంలో భారత్ బౌలింగ్ విభాగంలో ఇంత బలంగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ, ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఈసారి వరల్డ్ కప్ లో భారత బౌలింగ్ విభాగం.. ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు సిద్దంగా ఉంది. మరి ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు స్పిన్ బలంగా మారుతుందా లేదా పేస్ బౌలింగ్ బలంగా మారుతుందా చూడాలి.

Also Read:‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు..లవ్ థీమ్‌ 

- Advertisement -