IND vs ENG : విజయానికి చేరువ టీమిండియా !

17
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మద్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయనికి చేరువలో ఉంది మరో 150 పరుగులు చేస్తే నాలుగో టెస్టులో కూడా రోహిత్ శర్మ విజయం సాధించినట్టే. మూడో రోజు మూడో సెషన్ లో టీమిండియా బౌలర్స్ ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ 145 పరుగులకే కుప్పకూలారు. అశ్విన్ ఐదు వికెట్లు, కుల్దిప్ నాలుగు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (24), జైస్వాల్ (16) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

భారత్ విజయ లక్ష్యానికి కేవలం 152 మాత్రమే ఉండగా.. చేతినిండా వికెట్స్ ఉండడం వల్ల టీమిండియా లక్ష్యం ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్నట్లే. 2013 తర్వాత నుంచి సొంతగడ్డపై 150 పరుగుల లక్ష్యాన్ని చేధించిందిలేదు. నేటి మ్యాచ్ లో గెలిస్తే గత పదేళ్లుగా వస్తున్న ఆ చెత్త రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరి నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తుందా ? లేదా ఇంగ్లీష్ బౌలర్స్ సత్తా చాటి టీమిండియాను కట్టడి చేస్తారా అనేది చూడాలి.

రోహిత్ 4000 పరుగులు పూర్తి

తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తో రోహిత్ శర్మ 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న 17 బ్యాట్స్ మెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( 15,921 ), ఆ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రావిడ్ (13,265) ఉన్నారు.

Also Read:మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం!

- Advertisement -