కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు..

8
- Advertisement -

ఈ నెల 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీతో సందడి చేశారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ తోపాటు రిషబ్ పంత్, మహ్మద్ షమీ తదితర ప్లేయర్లు తాము ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమంటూ కొత్త జెర్సీలతో ఫోజులిచ్చారు. భారత జెర్సీలపై పాకిస్థాన్ పేరును తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. టోర్నమెంట్ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు ఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని, భారత జెర్సీలపై పాక్ పేరును తొలగించాలని మేము ఐసీసీని కోరలేమని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఈనెల 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది.

 

Also Read: ఇకపై ఉచిత ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండవు!

- Advertisement -