అన్నిట్లో మేమే నెంబర్ ఒన్..!

30
- Advertisement -

వరల్డ్ కప్పు కు ముందు టీమిండియా వరుస విజయలతో యమ దూకుడు మీద ఉంది. ఇటీవల జరిగిన ఆసియా కప్పును సొంతం చేసుకున్నా టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగుతున్న వన్డే సిరీస్ లో కూడా సత్తా చాటుతోంది. మొదటి వన్డే మ్యాచ్ లో సమిష్టి కృషితో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48 ఓవర్లలో 276 పరుగులు చేసి ఆలౌట్ గా నిలవగా టీమిండియా ఐదు కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్ లో ఋతురాజ్ గైక్వర్డ్ ( 77 బంతులు 71 పరుగులు ) , శుబ్ మన్ గిల్ ( 63 బంతులు, 74 పరుగులు ), కే‌ఎల్ రాహుల్ ( 58 బంతులు, 63 పరుగులు ) చేసి జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మహ్మద్ షమి ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో మొదటి వన్డే విజయం తో సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా ముందడుగు వేసింది.

ఇక ఈ మ్యాచ్ తో టీమిండియా మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్, వన్డే ర్యాంకింగ్, టి20 ర్యాంకింగ్ ఇలా మూడు ఫర్మాట్లలో కూడా నెంబర్ ఒన్ స్థానానికి చేరుకుంది, వరల్డ్ కప్ కు ముందు మూడు ఫార్మాట్ లలో కూడా నెంబర్ ఒంట్ స్థానానికి చేరుకోవడం టీమిండియాకు మంచి జోష్ నిచ్చే అంశం. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్ లో కూడా టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ నెంబర్ ఒన్ గా నిలువగా టి20 లలో సూర్య కుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అక ల రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా బౌలర్ల లో మహ్మద్ సిరాజ్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ ఒన్ గా కొనసాగుతూ టీమిండియాకు ఎవరు పోటీ కాదని నిరూపిస్తున్నారు. మరి టాప్ క్లాస్ ఆటతో అదరగొడుతున్న టీమిండియా ప్లేయర్స్ వరల్డ్ కప్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

- Advertisement -