మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఓటమి

1
- Advertisement -

మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి పాలైంది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. జైస్వాల్ 84 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. పంత్ 30 పరుగులు చేయగా రోహిత్ 9,కోహ్లీ 5,జడేజా 2,నితీశ్ 1 పరుగులు చేశారు.ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 3, బోలాండ్ 3,లయన్ 2,స్టార్క్, హెడ్ తలో వికెట్ తీశారు.

ఇక అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. లైయన్ 41 పరుగులు చేసి వెనుదిరుగగా బుమ్రా 5 వికెట్లు,సిరాజ్ 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో సిరీస్‌ను 2-1 తేడాతో లీడ్‌లో ఉంది ఆసీస్.

Also Read:TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

- Advertisement -