టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ జట్టు బస విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లో భారత్–న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా బస చేయనున్న హోటల్‌ను మార్చినట్లు సమాచారం.
ఇప్పటివరకు భారత జట్టు అహ్మదాబాద్‌లో ఒక ప్రత్యేక హోటల్‌లో బస చేయాల్సి ఉండగా, ఈసారి ఆ హోటల్‌ను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు కూడా భారత జట్టు ఇదే హోటల్‌లో బస చేసింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. అలాగే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌కు ముందు కూడా జట్టు అదే హోటల్‌లో ఉండిందని సమాచారం. ఆ మ్యాచ్‌లో కూడా భారత్‌కు ఓటమి ఎదురైంది.
Also Read;ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?
ఈ నేపథ్యంలో ఆ హోటల్ టీమ్ ఇండియాకు కలిసి రావడం లేదని భావించిన బీసీసీఐ అధికారులు ఈసారి జట్టు బసను మరో హోటల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్ ముందు ఎలాంటి ప్రతికూల అంశాలు లేకుండా జట్టు పూర్తి దృష్టిని ఆటపై కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక భారత్–న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. కోట్లాది మంది అభిమానులు టీమ్ ఇండియా విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

