రివెంజ్ అంటే ఇదే.. టీమిండియా దెబ్బ అదుర్స్!

35
- Advertisement -

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది, ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను 50 పరుగులకే కుప్పకూల్చి.. ఆ తరువాత వికెట్ పడకుండా 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి కప్పు సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఎనిమిదో సారి ఆసియా కప్పు సొంతం చేసుకున్నా జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. అయితే 23 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో ఇదే శ్రీలంక టీమిండియాను ఘోరంగా ఓడించింది. అప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన లంక 299 పరుగులు చేయగా లక్ష్య చేధనలో టీమిండియా 54 పరుగులకే ఆలౌట్ గా నిలిచి చెత్త పరాభవాన్ని మూటగట్టుకుంది. దానికి ప్రతికరంగా నిన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో అదే శ్రీలంక జట్టును 50 పరుగులకే కుప్పకూల్చి దెబ్బ అదుర్స్ అనిపించింది. .

లంక ఓటమిని శాసించడంలో హైదరబాద్ కా శాన్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్స్ ను బెంబేలెత్తి టీమిండియా విజయనికి రాచబాటలు వేశాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ సాధించడం ఇది రెండోసారి. గతంలో ఎం‌ఎస్ ధోని, అసరుద్దీన్ టీమిండియాకు రెండుసార్లు ఆసియా కప్ అందించారు. ఇక ఆసియా కప్ లో అత్యల్ప స్కోర్ ( 50 ) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. వన్డే ఫైనల్స్ లో 263 బంతులు మిగిలిండగానే విజయం సాధించడం టీమిండియాకు ఇదే మొదటిది. ఇక వన్డే టోర్నీ ఫైనల్స్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇలా నిన్న జరిగిన మ్యాచ్ తో పలు రికార్డులు, పలు చెత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఇక ఆసియా కప్ గెలిచిన జోష్ తో ఈ నెల 22 నుంచి ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ సిరీస్ కూడా కైవసం చేసుకుంటే వరల్డ్ కప్ కు ముందు టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసం కూడగట్టుకునే అవకాశం ఉంది.

Also Read:KCR: గణనాథుడి ఆశీస్సులతో సుభిక్షంగా తెలంగాణ

- Advertisement -