BCCI: మహిళ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే

13
- Advertisement -

మహిళల టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించగా ఈ సారి యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. దాయాది పాకిస్థాన్‌తో 6న తలపడనుండగా గ్రూపు దశలో టీమ్‌ఇండియా.. 9న శ్రీలంకతో 13న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ఉండగా గ్రూప్‌-బీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ ఉన్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు స్మృతి మందాన‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, దీప్తి శ‌ర్మ‌, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, య‌స్తికా భాటియా, పూజా వ‌స్త్రాక‌ర్‌, అరుంధ‌తి రెడ్డి, రేణుకా సింగ్ థాకూర్‌, ద‌యాల‌న్ హేమ‌ల‌త‌, ఆషా శోభ‌నా, రాధా యాద‌వ్‌, శ్రేయాంక్ పాటిల్‌, స‌జ‌నా స‌జీవ‌న్ ఉన్నారు.

Also Read:అభిమాని కుటుంబాన్ని స‌త్క‌రించిన చిరంజీవి

- Advertisement -