ఐసీసీ టీ20 వలర్డ్ కప్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. వరల్డ్ కప్‌లో చివరి నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో 250 పరుగులకు పైగా స్కోరు చేసి భారత బ్యాటింగ్ శక్తిని చూపించింది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్‌పైకి మళ్లింది. ఐపీఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తదుపరి టీ20 సిరీస్ జూలైలో జరుగుతుంది. ఆ సిరీస్‌లో భారత్.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభమై జూలై 11 వరకు కొనసాగుతుంది. చెస్టర్-లీ-స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!
ఈ పర్యటనలో టీ20లతో పాటు జూలై 14 నుంచి 19 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. అవి బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లార్డ్స్ మైదానాల్లో నిర్వహించబడతాయి. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత్ జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్ట్ మరియు మూడు వన్డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది.

