ఇండియాలో విమర్శలు..పాక్‌లో ప్రశంసలు..

220
Team India Fans Fire on Virat Kohli
- Advertisement -

టీచర్స్ డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పోస్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లను గుర్తుకు తెచ్చేలా కోహ్లీ ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు. వెనక కొందరు మాజీ క్రికెటర్ల పేర్లు కనిపిస్తుండగా.. వాటి ముందు కోహ్లీ కూర్చొని ఉన్న ఫొటో అది.

అంతా బాగానే ఉందికానీ.. వాటిలో సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లే పేర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఇండియన్ నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు. అయితే ఇదే సమయంలో పాకిస్థానీల నుంచి కోహ్లీకి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. కోహ్లీ వెనకున్న పేర్లతో తమ దేశ దిగ్గజాలు ఇమ్రాన్‌ ఖాన్‌, జావేద్‌ మియాందాద్‌, ఇంజమాముల్‌ హక్‌ పేర్లు ఉండడంతో ఆ దేశ అభిమానులు పొంగిపోతున్నారు.

- Advertisement -