పంత్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసలు

10
- Advertisement -

టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్‌పై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు గుప్పించాడు. పంత్‌ ఎంసీసీ ప్లేయింగ్‌ మాన్యువల్‌లో లేని షాట్లు ఆడుతున్నాడని.. అతన్ని తొలిసారి చూసినప్పుడు తనకు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు గుర్తుకు వచ్చాడని కొనియాడారు. పంత్ ప్రదర్శణ అద్భుతంగా ఉందని… పాత రోజుల్లో సాధ్యం కాదని షాట్లు ఆడడం చూడవచ్చని తెలిపాడు.

తన బ్యాట్‌తో క్రికెట్‌కు పంత్ కొత్త రూపాన్ని ఇస్తున్నాడని …. టీమిండియా కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను సైతం ప్రశంసించాడు. గిల్‌కు ఇది గొప్ప టెస్ట్‌ మ్యాచ్‌ అని.. మంచి ఆరంభం లభించిందని.. విచారకరంగా ఫలిత్‌ భారత్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్నాడు.

లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాక్‌టుబ్యాక్‌ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.

Also Read:పాక్‌పై రాజ్‌నాథ్‌ ఫైర్

- Advertisement -