అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. ఆసీస్‌ను సెమీఫైనల్లో మట్టికరిపించిన టీమిండియా టైటిల్ వేటలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది భారత్. టిమిండియా విధించిన 291 పరుగుల లక్ష్యచేదనలో 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌటైంది. కోరె మిల్లర్(38), క్యాంప్‌బెల్(30 రాణించారు.దీంతో టీమిండియా 96 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో విక్కీ ఓత్సవల్ 3 వికెట్లు, రవి కుమార్, నిశంత్ సంధు చెరో 2 వికెట్లు తీస్తే.. కుశాల్ తాంబే, రఘువంశీ తలో వికెట్ పడగొట్టారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 290 పరుగులు చేసింది. 37 పరుగులకే ఓపెనర్లు రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) వికెట్లు కొల్పోయిన భారత కెప్టెన్ యశ్ ధుల్(110 ) సెంచరీతో రాణించగా వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ( 94) పరుగులతో రాణించారు. సెంచరీతో అదరగొట్టిన భారత సారథి యశ్ ధుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.