రోహిత్‌ సేన..హ్యాట్రిక్‌ విజయం

32
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన హ్యాట్రిక్ విజయం సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా భారత్‌ 18.2 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్, కోహ్లీ మరోసారి నిరాశ పర్చిన సూర్యకుమార్, శివమ్ దూబె అద్భుతంగా ఆడారు. సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 50 నాటౌట్‌, 2 ఫోర్లు, 2 సిక్సర్లు చేయగా శివమ్‌ దూబె 31 నాటౌట్‌ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో నెగ్గడంతో భారత్‌ సూపర్‌ -8కు అర్హత సాధించింది.

అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన యూఎస్‌ఏ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ 23 బంతుల్లో 27,స్టీవెన్‌ టేలర్‌ 24 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/9) నిప్పులు చెలరేగడంతో అమెరికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. అర్ష్‌దీప్‌ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా?

- Advertisement -