Kohli:కోహ్లీ పైనే భారం.. బాధ్యత!

31
- Advertisement -

వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 243 పరుగుల తేడాతో భారీ విజయన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (40), విరాట్ కోహ్లీ (101), శ్రేయస్ అయ్యర్ (77), చెలరేగడంతో భారీ స్కోర్ నమోదు అయింది. ఆ తరువాత లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బ్యాటర్ల ను భారత పేసర్లు కుప్పకుల్చారు. ఏ దశలోనూ సఫారీలకు ఛాన్స్ ఇవ్వకుండా 83 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా అద్బుత విజయాన్ని నమోదు చేసింది. జడేజా ఐదు వికెట్లు, షమీ 2 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్.. తీసి సౌతాఫ్రికా నడ్డివిరిచారు. సెమీస్ కు ముందు ఈ విజయం టీమిండియాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై అన్నీ వైపులా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సెంచరీతో వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కోహ్లీ. సచిన్ 452 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీలు సాధించగా.. కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్ లలోనే 49 సెంచరీలు సాధించి ఆ రికార్డ్ ను సమం చేశాడు. ఇక టీమ్ లో కోహ్లీ బాద్యతను ప్రస్తావిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంశలు కురిపించాడు. కోహ్లీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా ఆడగలడని, బ్యాటింగ్ కు అనుకూలంగా లేని పిచ్ లపై చివరి వరకు ఆడడం సీనియర్ ఆటగాడిగా విరాట్ బాధ్యత అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Also Read:Venkatesh:జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్.. బ్లాక్ బ‌స్ట‌ర్ చేయండి

- Advertisement -