Asia Cup:యూఏఈ పై భారత్‌ ఘన విజయం

6
- Advertisement -

ఆసియా కప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. పసికూన యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా…4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కొల్పోయి 60 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 13.1 ఓవర్లలోనే 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు,శివమ్ దూబె 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. భారత్ తన నెక్ట్స్ మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.

Also Read:కాంగ్రెస్‌ అహంకారానికి ఓటుతో బుద్ధిచెప్పాలి

- Advertisement -