న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

7
- Advertisement -

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో తొలి సెమీస్ మ్యాచ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా, రెండో సెమీస్‌లో ద‌క్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఢీ కొట్ట‌నుంది. మార్చి 4న దుబాయ్ వేదిక‌గా ఆసీస్‌తో తలపడనుండగా మ‌రో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ మార్చి 5న అంటే బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు పాక్‌లోని గ‌ఢాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. న్యూజిలాండ్ 45.3 ఓవ‌ర్ల‌లో 205 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్ స‌న్ (81) , విల్ యంగ్ (22) రాణించగా భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు,హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్ తలో వికెట్ తీశారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్ష‌ర్ ప‌టేల్ (42) పరుగులు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు.

Also Read:టీపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్‌!

భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ జట్టు:
విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరౌర్క్

- Advertisement -