ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

33
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో బోణి కొట్టింది టీమిండియా. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ విధించిన 96 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి చేధించింది.రోహిత్‌ శర్మ 37 బంతుల్లో 3 సిక్స్‌లు,4 పోర్లతో 52, రిషబ్ పంత్‌ 26 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 36 నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత బౌలర్ల ముందు కుదలైంది.హార్దిక్‌ (3/27), మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బుమ్రా (2/6), సిరాజ్‌ (2/35) విజృంభించారు. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో డెలాని 14 బంతుల్లో 2 సిక్స్‌లు,2 ఫోర్లతో 26 పరుగులు చేశారు. ఓ దశలో 52 పరుగులకే 8 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్‌ 60 అయినా చేస్తుందా? అనిపించినా చివర్లో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడటంతో ఐర్లాండ్ 96 పరుగులు చేయగలిగింది.

Also Read:సత్యభామ..ఎమోషనల్ యాక్షన్ మూవీ

- Advertisement -