వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 273 పరుగుల భారీ లక్ష్యాన్ని 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 273 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. రోహిత్ 84 బంతుల్లో 5 సిక్స్‌లు, 16 ఫోర్లతో 131 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ (55) నాటౌట్, ఇషాన్ కిషన్ (47),శ్రేయస్ అయ్యర్ (25) నాటౌట్‌గా నిలిచారు.
భారత బ్యాటర్ల విన్యాసాలు వీక్షించేందుకు మైదానానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరాగా.. స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (62) పరుగులతో రాణించగా రహ్మానుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (16), మహమ్మద్ నబీ (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు.
రికార్డు సెంచరీ నమోదు చేసిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా శనివారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది భారత్.
Also Read:చంద్రబాబు కు బెయిల్.. రెడీ?