Ind Vs Aus:150 పరుగులకే టిమిండియా ఆలౌట్

5
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నితీశ్ రెడ్డి 41 పరుగులతో రాణించగా పంత్ 37, రాహుల్ 26 పరుగులు చేశౄరు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్ 4,స్టార్క్, కమిన్స్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.

స్వదేశంలో న్యూజిలాండ్‌ జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బ్యాటింగ్‌లో భారత్‌ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్‌తోనూ ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌ అదే ఆటతీరు కనబరుస్తున్నారు. ఓ దశలో టీమ్‌ఇండియా 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రిషభ్‌ పంత్‌ ,నితీశ్ రెడ్డి రాణించడంతో ఆ మాత్రం స్కోరైన చేయగలిగింది టీమిండియా.

 

Also Read:కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్!

- Advertisement -