మునుగోడులో బీజేపీకి టీడీపీ మద్దతు

117
tdp
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజాక్షేత్రంలో వెనుకబడ్డ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి బూస్ట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో తొలుత పోటీ చేస్తామని ప్రకటించిన టీడీపీ చివరకు రణక్షేత్రం నుండి తప్పుకుంది.

పోటీ నుండి తప్పుకోవడం బాగానే ఉన్నా బీజేపీకి మద్దతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అసలే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డికి టీడీపీ మద్దతివ్వడం మరింత సంక్షిష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీడీపీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీని ఆంధ్రా పార్టీగా ప్రజల ముందు నిలపడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది.

ఆ తర్వాత పలు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన కనీస ఓట్లను కూడా రాబట్టలేకపోయింది. అలాంటి టీడీపీని మద్దతివ్వాలని బీజేపీ నేతలు కోరడం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఓకే చెప్పడం కాషాయ పార్టీ నేతలకే మైనస్‌. ఎందుకంటే ఈ నిర్ణయం భవిష్యత్‌లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబుకు ఉపయోగపడుతుందేమో కానీ మునుగోడులో మాత్రం లోటస్ మునిగిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -