జగన్‌కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

4
- Advertisement -

ఈవీఎంలతో ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం పరిణవిల్లాలంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ట్వీట్ చేశారు జగన్.

దీనికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరు బేష్ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీటీడీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి.. 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు అని చురకలు అంటించింది.

జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గెలిస్తే తన గొప్ప.. ఓడిపోతే ఈవీఎంల తప్పా? …2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి జగన్ ఏం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద.. ఆత్మస్తుతి మానాలని హితవు పలికారు.

Also Read:Pushpa 2:అందుకే ఆలస్యం..మేకర్స్ క్లారిటీ!

- Advertisement -