- Advertisement -
ఇకపై పార్టీలో చేరాలంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి.ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన..పార్టీలో చేరికలపై కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని, ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.

- Advertisement -

