జూబ్లీహిల్స్..పోటీకి టీడీపీ దూరం

7
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదు. తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన భేటీలో నిర్ణయించారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ – జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది టీడీపీ.

బీజేపీ తమ మద్దతు కోరితే ఆలోచిస్తామని తెలిపారు చంద్రబాబు. త్వరలోనే మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, సమర్థులకే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలిపారు చంద్రబాబు.

Also Read:భూమనపై భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

- Advertisement -