- Advertisement -
ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత,టెక్కలీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ స్కామ్‌లో కొద్దిరోజులుగా అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతుండగా ఇవాళ అరెస్ట్ చేసింది ఏసీబీ. టెక్కలీలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు దాదాపు రూ.988 కోట్ల కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావిస్తున్నారు.
ఏపీ ఈఎస్ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.దాదాపు రూ. 150 కోట్ల కుంభకోణం కాగా నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని ఈడీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని తెలిపింది.
- Advertisement -