ఏపీలో వైసీపీ హవా…కుప్పంలో తొలిసారి టీడీపీ ఓటమి

61
chandra babu
- Advertisement -

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలో తొలిసారిగా వైసీపీ జెండా ఎగురవేసింది. భారీ మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 25 వార్డులకు గానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 14 స్ధానాలను 1,2,3,4,,6,7,8,9,10,12,13,14,15 వైసీపీ గెలుచుకుంది. మరో తొమ్మిది స్థానాలకు ఫలితాలు రావాల్సి ఉంది..

నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయితీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా రాజంపేట మున్సిపల్‌ ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను గెలుపొందింది వైసీపీ.

- Advertisement -