కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్ విసిరిన టీడీపీ నేత..

128
- Advertisement -

గుడివాడలోని కే కన్వెన్షన్‌లో అర్దనగ్న నృత్యాలు, క్యాసినో జరిగాయని నిరూపిస్తాం పెట్రోల్ డబ్బాతో తగులబెట్టుకోవడానికి సిద్ధమా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ సవాల్ విసిరారు. శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాల్ని దెబ్బతీసే విధంగా డబ్బు పిచ్చి పట్టిన కొడాలి నాని, వైసీపీ నాయకులు రాష్ట్రంలోకి క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చారు. అర్దనగ్న నృత్యాల్ని కొడాలి నానికి చెందిన కే కన్వన్షెన్‌లో చేయించారు. కృష్ణా జిల్లా ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేశాం. వీడియోలు కూడా చూపాం. మేము చేసిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ కేబినెట్ అవగానే కొడాలి నానీ చాలా ప్రెస్టేషన్‌లో మీడియా ముందుకొచ్చి ఊగిపోయారు. కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగిందో తెలియదు. ప్రభుత్వ పరువు దిగజారిందని భయపడినట్లున్నారు. ఇవన్నీ బయటికొచ్చాయని ఉలిక్కిపడినట్లున్నారు. మమ్మల్ని దుర్భాషలాడారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో జరిగిన క్యాసినో జూద క్రీడలు, అర్దనగ్న నృత్యాలు కే కన్వెన్షన్ కళ్యాణమండపంలో జరిగినట్లు రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకుంటానన్నారు. దమ్ముంటే నిరూపించండని సవాల్ విసిరారు. నీ సవాల్ ని టీడీపీ స్వీకరిస్తోంది. నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నామని బొండా ఉమ అన్నారు.

గుడివాడలోని నీ కే కన్వెన్షన్ లో క్యాసినో జూదశాలగా మార్చుకొని జూదాన్ని నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన ఆడవారితో అర్దనగ్న నృత్యాలు చేయించారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేం నిరూపించలేకపోతే నీవు రా.. నీవు ఒక పెట్రోల్ డబ్బా తీసుకొని రా.. నేనూ ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తాను. నిరూపిస్తే పెట్రోల్ డబ్బాతో నీవు తగులబెట్టుకోవాలి. నిరూపించుకోలేకపోతే నేను తగులబెట్టుకుంటాను. ఇందుకు సిద్ధమేనేమో కొడాలి నాని చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. ఈ ప్రెస్ మీట్ కి రిప్లై ఇవ్వాలి. మా నాయకుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటి పోలీసుల అనుమతితో గుడివాడకు వెళ్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయింది. బెంబేలెత్తిపోయిన కొడాలి నాని, ప్రభుత్వం ఎక్కడ మీడియాలో తన బండారం బయట పడుతుందో అని భయపడ్డారు. ఒకవైపు అనుమతి ఇచ్చి మరోవైపు వైసీపీ గూండాలను పెట్టి మమ్మల్ని అక్కడికి రానీయకుండా చేశారు. క్యాసినో కార్యక్రమాలు జరిగిన పరిసరాల్లో మాకు రానివ్వలేదు. ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. కొడాలినాని సచ్చీలుడైతే, నీతివంతుడైతే, నీ కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే నీవో, నీ మనుషులో మాకు నీ కన్వెన్షన్ లోపలికి తీసుకెళ్లి చూపించవచ్చు కదా?. ఒక పొలిట్ బ్యూరో మెంబర్ గా కాక ప్రజల మనిషిగా అడుగుతున్నాను.

నీ కన్వెన్షన్ లో ఇలాంటివి జరగలేదా? సోషల్ మీడియాలో పెద్దగా వచ్చింది. అన్ని మీడియా ఛానళ్లు ప్రముఖంగా చూపించాయి. వైసీపీ చేస్తున్న నిర్వాకాలను చూసి జనం ఆశ్చర్యపోయారు. దీనిపై పోలీస్ ఎంక్వైరీ చేయాలని కంప్లైంట్ ఇచ్చాం. నిజనిర్ధారణ కమిటిని ఎందుకడ్డుకున్నారు? అడిగినదానికి సమాధానం చెప్పకుండా ప్రెస్టేషన్ లో ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబు, లోకేష్, మమ్మల్ని దుర్భాషలాడారు. గౌరవనీయులు వర్ల రామయ్య గారిని పకోడీగాడన్నారు. ఎందుకు కన్వెన్షన్ లోపలికి తీసుకెళ్లి చూపించలేకపోయారు. వీళ్లెవరు వెళ్లటానికని ఓ మంత్రి అన్నారు. మేం రాము, మీరే అధికారిని నియమించుకొంటే మీడియాను పంపుతాము. అక్కడ జరగలేదంటే పెట్రోల్ పోసుకొని నేను తగులబెట్టుకుంటాను. జరిగింది అని మీడియా, అధికారులు చెబితే నీవు తగులబెట్టుకోవద్దుగానీ రాజీనామా చేయి. నీ చావును మేం కోరుకోం..అక్కడ ఏం జరిగిందో సీఎంకు, డీఐజీకి, డీజీపీకి, ప్రభుత్వాధికారులకు కూడా తెలుసు. ఆల్ ఇండియా సర్వీస్ వారితోనైనా లేదా ఏ అధికారులతోనైనా త్రిమెన్ కమిటీని వేసి విచారిస్తామన్నా మాకు సమ్మతమే. మీడియాను మాత్రం అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. నిరూపించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ కొడాలి నానికి హితవు పలికారు.

- Advertisement -