వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్ర ఖజానా దివాళా- బొండా ఉమా

72
- Advertisement -

వైసీపీ అసమర్థ పాలన తో రాష్ట్ర ఖజానా దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని,ఉద్యోగుల ఆందోళన, గుడివాడ క్యాసినో వివాదం నుంచి దృష్టి మళ్లించేదుకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రీయ వచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. శనివారం ఆయన ఏపీలో కొత్త జిల్లాల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రజలపై భారాలు వేస్తోందని చెత్తపై పన్నువేసిన చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు.

జీవో 225 పేదల మెడకు ఉరితాడుగా మారిందని టీడీపీ హయాంలో జీవో 74 ద్వారా ప్రభుత్వం కట్టిన ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ కల్పించామన్నారు. ఎపుడో కట్టిన ఇళ్లకు..డబ్బులు కట్టాలని ఇప్పుడు ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని.. కట్టకపోతే ఇల్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించడం సరికాదన్నారు. ఎవరు డబ్బులు కట్టవద్దని.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అప్పుడు ఉచితంగా సర్వ హక్కులు కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరులో అయితే విజయవాడ జిల్లాకు పేరు పెడుతున్నారని.. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలు అభిప్రాయం తీసుకొని జిల్లాల ఏర్పాటులో తప్పులు సరిదిద్దుతామని బోండా ఉమా‌ పేర్కొన్నారు.

- Advertisement -