Chandrababu: పంపకాల పంచాయతీ.. తేలేదెప్పుడో?

22
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ జనసేన పార్టీల మద్య ఒత్తిడి రెట్టింపు అవుతోంది. వచ్చే నెలలో దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికి రెండు పార్టీల మద్య సీట్ల పంచాయితీ ఓ కొలిక్కి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో కూటమిగా ఏర్పడిన ఈ రెండు పార్టీలు గత కొన్నాళ్లుగా ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉండగా.. సీట్ల పంపకాలు ఒకపట్టాన తేలడం లేదు. మరోవైపు అధికార వైసీపీ వేగంగా అభ్యర్థులను ఖరారు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇటు టీడీపీ జనసేన మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఊగిసలాడుతున్నాయి. అయితే అభ్యర్థుల ఖరారుపై ఇంకా ఆలస్యం చేస్తే ఇరు పార్టీలకు నష్టమేననేది రాజకీయ వాదులు చెబుతున్న మాట. .

ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ” ఈ నెలాఖరు లోగా సీట్ల కేటాయింపుపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఏ పార్టీ ఏ సీట్లను త్యాగం చేస్తోంది ? టీడీపీ జనసేన మద్య పంపకాలు ఎలా ఉండబోతున్నాయనేది హాట్ టాపిక్ మారింది. ఓవరాల్ గా 30-40 సీట్లను జనసేన డిమాండ్ చేస్తున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ 15-20 సీట్లు ఇచ్చేందుకే టీడీపీ మొగ్గుతుపుతున్నట్లు వినికిడి. ఇలా ఇరు పార్టీల మద్య పొంతన లేకపోవడంతోనే పంపకాల విషయంలో అసలు పంచాయతీ ఏర్పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం జనసేన కు 20-30 ఎలాగోలా ఫైనల్ చేసేందుకు టీడీపీ భావిస్తున్నట్లు వినికిడి. మరి ఈ రెండు పార్టీల మద్య సీట్ల పంచాయతీ పై పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్

- Advertisement -