అధికారంలోకి వచ్చినా న్యాయం జరగలేదు..మాజీ ఎమ్మెల్సీ ఆవేదన

6
- Advertisement -

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తనకు న్యాయం జరగలేదన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఎంపీ కేశినేని చిన్ని బర్త్‌ డే సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో బుద్ధా వెంకన్న భారీ కేక్‌ కట్‌చేశారు. తనకు పదవి లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నా అని చెప్పారు.

వైసీపీ పాలనలో తాను అనేక పోరాటాలు చేశానని.. తనపై 37 కేసులు పెట్టారని చెప్పారు. తనతో పాటు కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యేగా ఉండాలని ఇప్పుడు అర్థమైందని అన్నారు.

2029లో ఎలాగైనా సరే పోరాటం చేసి ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుంటానని చెప్పారు. 2024లో చంద్రబాబుకు రక్తంతో అభిషేకం చేసినా తనకు టికెట్‌ రాలేదని తెలిపారు. సీఐల బదిలీ విషయంలో ఎమ్మెల్యేల మాటనే నెగ్గిందని.. వాళ్లు చెప్పిన వారికి పని జరిగిందని అన్నారు. ప్రస్తుతం తాను మాత్రం ఇతరులపై ఆధారపడి ఉండాల్సి వస్తుందని బాధపడ్డారు.అయితే ఇదంతా తాను వ్యతిరేకతతో కాదు ఆవేదనతో అడుగుతున్నానని స్పష్టం చేశారు.

Also Read:తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -