ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. మొత్తం 175 స్థానాల్లో 161 స్థానాల్లో టీడీపీ -జనసేన – బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా అధికార వైసీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది.
ఇక టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకోగా జనసేన రెండో 20 స్థానాలను దక్కించుకుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో వైసీపీ నిలిచింది. బీజేపీ మరో 7 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 1994 ఎన్నికల తర్వాత టీడీపీకి రాష్ట్రంలో దక్కిన అతి పెద్ద విజయం ఇదే. పోటీ చేసిన 144 సీట్లలో టీడీపీ 133 సీట్లలో గెలవడం చరిత్రగా నిలవబోతోంది.
దాదాపు 93 శాతం స్ట్రైక్ రేట్ తో టీడీపీ సాధించబోతున్న విజయం రాష్ట్రంలో అన్ని లెక్కల్ని మార్చేసేలా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ తర్వాత రెండో స్ధానంలో ఎన్డీయే మిత్రపక్షం జనసేన నిలవబోతుండటం మరో విశేషం.
Also Read:జనసేన ప్రభంజనం..