టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్..

180
Achannaidu arrested
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఆరోపణలపై ఆయనను ఆరెస్ట్‌ చేశారు. అంతకుముందు నిమ్మాడలోని అచ్చెన్నాయుడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -