ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ పార్టీల మద్య రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రెండు పార్టీల అధినేతలు కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు రెండు పార్టీలకు కూడా కీలకం కావడంతో ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు ఇరు పార్టీల అధినేతలు. ఇదిలా ఉంచితే ఈ మద్య అధికార వైసీపీలో అంతర్గత సంక్షోభం ఈ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పార్టీలోని సీనియర్ నేతలు జగన్ తీరుపై తీవ్ర అసహనం చూపుతూ ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు..
ఆ మద్య పట్టభధ్రుల ఎన్నికల టైమ్ లో నలుగురు ఎమ్మేల్యేలు సొంత పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడి పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వైసీపీ లో వివిధ కారణాల చేత అసంతృప్తిగా ఉన్న నేతలను టీడీపీలో లాక్కునేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారు టీడీపీ గూటికి దారులు వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావ్ కూడా ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన కూడా టీడీపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. కాగా యార్లగడ్డ గన్నవరం టికెట్ ఆశించి భంగపడి టీడీపీలోకి చేరబోతున్నారని తెలుస్తున్నాప్పటికి, ఈ తతంగం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనేది కొందరు చెబుతున్నా మాట. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ నేతలను మరికొంత మందిని టీడీపీలోకి ఆహ్వానించేందుకు అన్నీ రకాలుగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. మొత్తానికి ఈ మద్య అధికార వైసీపీలో ఏర్పడిన అంతర్మధనం వెనుక చంద్రబాబు ప్రణాళిక ఉందా అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:జగ్గారెడ్డిపై కాంగ్రెసే అలా చేస్తోందా ?