కాంగ్రెస్‌తో దోస్తీ.. టీడీపీ సెల్ఫ్ గోల్?

40
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అనూహ్యంగా రేస్ నుంచి తప్పుకున్న టీడీపీ.. పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతూ వచ్చింది. అయితే అధికారికంగా టీడీపీ కాంగ్రెస్ మద్య పొత్తును ఇరు పార్టీనేతలు కన్ఫర్మ్ చేయనప్పటికీ.. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు గట్టిగానే వార్తలు వినిపించాయి. ప్రచార సమయంలో తుమ్మల నాగేశ్వర రావు, భట్టి విక్రమార్క వంటివారు టీడీపీ కండువాలు కప్పుకోవడం టీడీపీ మద్దతుగా మాట్లాడడం చేస్తూ వాచ్చారు. పైగా కాంగ్రెస్ గెలిచిన తరువాత గాంధీభవన్ ముందు టీడీపి జెండాలు కూడా గట్టిగానే కనిపించాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే టీడీపి కాంగ్రెస్ మద్య అంతర్గత పొత్తు ఉందనే సంగతి ఇట్టే అర్థమౌతుంది. అయితే తెలంగాణలో జరిగిన ఈ పరిణామలే ఏపీలో టీడీపిని సెల్ఫ్ గోల్ వేసుకునేలా చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారం కోసం ఆరాటపడుతున్న టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది. అలాగే బీజేపీతో కూడా పొత్తు కోసం ఆరాటపడుతోంది.

ఈ నేపథ్యం టీడీపి కాంగ్రెస్ మద్య సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతో టీడీపి తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపి.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపడంతో టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ కాంగ్రెస్ తో చేతులు కలిపిన సంగతి విధితమే. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల ముందు తెలంగాణలో టీడీపీ మరియు కాంగ్రెస్ సత్సంబంధాలపై చర్చ జరుగుతోంది. దాంతో ఈసారి ఎన్నికల్లో కూడా టీడీపీకి భారీ ఓటమేనా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి టి.కాంగ్రెస్ తో సంబంధం కారణంగా టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇస్తుందా లేదా లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.

Also Read:పుష్ప నటుడు జగదీశ్‌ అరెస్ట్..

- Advertisement -