టైమ్ చూసి బీజేపీతో దోస్తీ..బాబు ప్లాన్?

26
- Advertisement -

గత కొన్నాళ్లుగా ఏపీలో పొత్తు వ్యవహారం తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా పొత్తుల కోసం ఆరాట పడుతున్న టీడీపీ బీజేపీ వైపు నుంచి సరైన స్పందన రావడం లేదు. రాష్ట్రంలో వైసీపీని ఓడించాలంటే 2014 కూటమి రిపీట్ కావడం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ సమస్యంతా బీజేపీ వైపు నుంచే ఉంది. గతలో టీడీపీ వల్ల ఎదురైన పరాభవాల దృష్ట్యా ఆ పార్టీతో మళ్ళీ కలిసి నడిచేందుకు ససేమిరా అంటూ వస్తున్నారు కమలనాథులు. పవన్ కూడా టీడీపీ మరియు బీజేపీ మద్య వారధిలా ఉంటూ కలిపే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఫలించడం లేదు. .

దీంతో పొత్తు లేనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి నిన్న మొన్నటి వరకు. ఎవరికి వారే అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక పై కూడా దృష్టి సారించాయి ఈ మూడు పార్టీలు. అయితే మళ్ళీ ఏమైందో గాని చంద్రబాబు పొత్తుకోసమే వెంపర్లాడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీద రూ.100 స్మారక నాణెం విడుదల తరువాత అనూహ్యంగా బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే పైకి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ భేటీ అని వినిపిస్తున్నప్పటికి.. లోలోపల రాజకీయం కోసమే ఈ భేటీ అనేది మరికొందరి అభిప్రాయం.

Also Read:పిక్ టాక్ :హద్దులు దాటిన అందాలండోయ్

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మరియు కేన్ద్ర్జ హోమ్ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయినట్లుగా సమాచారం. ఈ భేటీలో పొత్తు కు సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మూడు పార్టీలు కలవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తదుపరి వ్యూహాలు, సి‌ఎం అభ్యర్థి ఎంపిక.. తదితర అంశాలను చంద్రబాబు కమలనాథుల వద్ద ప్రస్తావించినట్లు వినికిడి. దీంతో చంద్రబాబు కన్వీన్స్ చేసిన విధానానికి బీజేపీ పెద్దలు కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పొత్తుకు సంబందించి తుది నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉందట. మొత్తానికి మొన్నటి వరకు దోస్తీకి ససేమిరా అన్నీ బీజేపీని టైమ్ చూసి చంరబాబు దారిలోకి తెచ్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read:అయోవా – తెలంగాణ మధ్య పరస్పర సహకారం..

- Advertisement -