ఎన్డీయేకి టీడీపీ రాం…రాం

258
TDP breaks away from NDA
- Advertisement -

అంతా అనుకున్నట్లే జరిగింది. ఓ వైపు ప్రజల నుంచి ఒత్తిడి మరోవైపు పొలిటికల్ ప్రెజర్‌..ఈ నేపథ్యంలో పార్టీ పొలిట్ బ్యూర్ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయేతో దశాబ్దాల దోస్తికి కటీఫ్ చెప్పేశారు చంద్రబాబు. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి ఆ పార్టీ పొలిటిబ్యూరో ఏకగ్రీవంగా అమోదించింది.

ఎన్డీయేతో విడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకి లేఖ రాశారు టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబు. అంతేగాదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానికి కూడా సిద్దమయ్యారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరామని తెలిపిన చంద్రబాబు ఆంధ్రాకు జరిగిన అన్యాయాన్ని లేఖలో వివరించారు. రాష్ట్రానికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీని కాంగ్రెస్ నట్టేట ముంచితే బీజేపీ కూడా అదే చేస్తోందన్నారు.

TDP breaks away from NDA

పనిలోపనిగా జనసేన అధినేత పవన్, వైసీపీ చీఫ్ జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఏపీకి వ్యతిరేకంగా మహా కుట్ర జరుగుతోందని వారిని ప్రజాకోర్టులో నిలబెడతామన్నారు. అవిశ్వాసం,రాజీనామాలు చేయించి…, పవన్‌ జగన్‌ల ద్వారానే హోదా వచ్చేలా చేస్తామని బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి సహకరిస్తానని పవన్ చెప్పినట్లు తిరుపతి ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తుచేశారు. ఆర్థిక నేరస్తులకు పీఎంవోలో ఏం పని అని ప్రశ్నించారు. నీరవ్ మోడీ లాంటి నిందితులు దేశం దాటిపోతున్నారని…, విజయసాయి రెడ్డిలాంటి వాళ్లు పీఎంవోలో తిరుగుతున్నారని…వీటి ఏ సంకేతాలు ఇస్తున్నామని కేంద్రాన్ని నిలదీశారు.

- Advertisement -