Chandrababu:టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అప్పుడే?

37
- Advertisement -

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ జగన్ వ్యూహంలో భాగంగా 60-70 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు కచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అటువైపు టీడీపీ వైసీపీ అసమ్మతి నేతలకు గళం వేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీట్ల కేటాయింపుపై కూడా ముమ్మరమైన చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఎవరికి అధిక ప్రాధాన్యం ఇస్తుందనే దానిపై గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపుపై మొదటి నుంచి చంద్రబాబు ఖరాఖండీగానే చెబుతూ వస్తున్నారు. ఈసారి యువతకు అధిక సీట్లు కేటాయిస్తామని, ప్రజా మద్దతు లేని వారిని పక్కన పెట్టడంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోమని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు..

ఇకపోతే జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపై కూడా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఆ పార్టీ 30-40 సీట్లను కోరుతున్నప్పటికి టీడీపీ అధిష్టానం మాత్రం 20-30 సీట్లు మాత్రమే కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు టాక్. ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి చంద్రబాబు సీట్లు కేటాయిస్తారా లేదా అనేది సందేహమే. ఇక అన్నీ సమీకరణలను బేరీజు వేసుకొని సంక్రాంతి తర్వాత మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారట. దీంతో ఫస్ట్ లిస్ట్ లో ఎవరికి చోటు కోసం నేతలందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ మొదటి జాబితా విడుదల తరువాత ఏపీ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:కాంగ్రెసోళ్ళు అంటే కాంగ్రెసోళ్లే!

- Advertisement -