కెనడాలో బతుకమ్మ సంబరాలు..

275
TDF, Canada Bathukamma Celebrations 2017
- Advertisement -

ఇండియా బయట తెలంగాణ పల్లె ఉన్నదా అని అందరూ ఆశ్చర్య పడేలా చేశారు కెనడాలో ఉన్న మన తెలంగాణ కుటుంబాలు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) వారి ఆధ్వర్యంలో ఈ నెల 16 నాడు (సెప్టెంబర్‌ 16, 2017 ) కెనడాలోని టొరంటో (మిస్సిసౌగ) నగరంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ అచ్చం తెలంగాణ పల్లెను గుర్తు చేసింది. 500 మంది హాజరు అయిన ఈ సంబరాలలో ఆట, మాట, పాట అన్నిట్లో పూర్తి తెలంగాణ సాంప్రదాయ రీతిలో జరుపుకొని విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు తమ సంస్కృతిని నిలబెట్టుకోవడంలో ఎంతగా పాటు పడుతున్నారు అనే విషయానికి ఒక నిదర్శనంగా ఉంది. ఆహ్లాదకరం అయిన వాతావరణంలో అనేక మంది తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మ లను పేర్చి బతుకమ్మ పాటలు పాడుకుంటు సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.

TDF, Canada Bathukamma Celebrations 2017

ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా పెట్టారు. పెద్ద వాళ్ళు తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగ యొక్క గొప్పదనాన్ని పిల్లలకు చెప్పారు. తరువాత రక రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుకి అందరు కూడా ఆహారాన్ని డొనేట్ చేశారు. చాల బాగా కార్య క్రమాన్ని చేసిన నిర్వాహకులను అందరూ మెచ్చుకున్నారు. కార్య క్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ,బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతూనే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్య క్రమాలను చేస్తూ ఉంటామని తెలుపుతూ కార్య క్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా కు చెందిన దిగువ పేర్కొన్న కార్యవర్గ సభ్యులు పాల్గొని అందరికి ధన్యవాదాలు తెలిపారు.

TDF, Canada Bathukamma Celebrations 2017

ఫౌండేషన్ కమిట చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేంధర్, బోర్డు అఫ్ ట్రస్టీస్ వైస్ చైర్మన్ పిణీకేశి అమిత, అధ్యక్షులు నెరవేట్ల శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మడుపు విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ కోండం పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ అర్షద్ ఘోరీ, ట్రెఅసురేర్ కీసర మహేందర్ రెడ్డి, గ్లోబల్ అఫైర్స్ ఇన్ ఛార్జ్ పిణీకేశి తిరుపతి రెడ్డి మరియు ఇతరులు. టీడీఫ్ కెనడా వారు 2005 నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా బతుకమ్మ పండుగను కెనడాలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారో దిగువ పేర్కొన్న కోఆర్డినేటర్స్ చాలా శ్రమించి ఆ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపించారు. పద్మ గంట, కవిత మూల, శాంత మేడ , అమిత రెడ్డి పినికేసి, శ్రీదేవి ధర్మపురి, సౌమ్య చింతలపాని , ప్రవీణ ఖంభంపాటి, అతిధి పున్నం, శ్రావ్య రెడ్డి మెరెడ్డి, సునీత నెరవేట్ల, రజని మాదాడి, విజయలక్ష్మి రావు మడుపు , ప్రమోద్ ధర్మపురి, శేషాంక్ చింతలపాని, వెంకటరమణ రెడ్డి మేడ మరియు మహేష్ మాదాడి. ఇక్కడ త్వరలో చలి కాలం ప్రారంభం అవుతుండదంతో బతుకమ్మ సంబరాలు కొన్ని రోజుల ముందుగానే నిర్వహించదం జరిగింది అని నిర్వాహకులు తెలిపినారు.

- Advertisement -