- Advertisement -
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పాలక, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఇల్లందు, కొత్తగూడెం ఏరియాలను కైవసం చేసుకుంది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు ఏరియాలో ఏఐటీయూసీపై 217 ఓట్ల మెజారిటీతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అలాగే.. కొత్తగూడెం 580ఓట్ల మెజారిటీతో టీబీజీకేఎస్ విజయం సాధించింది.
- Advertisement -