కేంద్రప్రభుత్వం వైఖరిపై టీబీజీకేఎస్‌ నిరసన

176
kavitha
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిరసన ఈ 26న అన్ని గనుల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనుంది ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు మాజీఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

జూలై 2వ తేదీన 24 గంటల పాటు సమ్మె నిర్వహిస్తామని…కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 42 బొగ్గు గనులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.జులై రెండవ తేదీన 24 గంటల పాటు నిర్వహించే సమ్మె ద్వారా కార్మికుల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

- Advertisement -