‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా వచ్చినట్టే వచ్చి, సైలెంట్‌గా థియోటర్స్‌లోంచి మాయవైపోయింది. అయితే దాన్ని ఆడియెన్స్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ వేసిన మార్క్‌ని మాత్రం ఆడియెన్స్ మర్చిపోలేరు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పుడు విజయ్ ‘టాక్సీవాలా’గా రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యాయి. మంచి రెస్పాన్స్‌కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటంటే..రిలీజ్‌కు ముందే ‘టాక్సీవాలా’ ప్రీరిలీజ్ పై మార్కెట్‌లో మాంచి హైప్‌కనిపిస్తోందని టాక్. ఎంతగా అంటే..శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దశకు వచ్చేసిందట. టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ అమ్మకంతోనే ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి నిర్మాతలకు వచ్చేసిందని తెలుస్తోంది.
అర్జున్‌రెడ్డి హీరోగా విజయ్‌కి ఇప్పుడున్న క్రేజ్‌తో శాటిలైట్,డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని, ఇక థియేటర్ల వద్ద ఈ సినిమా ఎంత రాబట్టినా అదంతా లాభమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదేగనక నిజమైతే.. రిలీజ్‌కి ముందే ‘టాక్సీవాలా’ హిట్ కొట్టినట్టే మరి. కాగా.. ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.