లండన్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్న తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) తెలంగాణ ప్రజలను మరోసారి ఒకే వేదికపైకి తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
టాక్ ఆధ్వర్యంలో జూలై 15న బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్షురాలు కంది పవిత్ర, ఉపాధ్యక్షులు సేరు సంజయ్ మరియు స్వాతి బుడగం తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్,మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ప్రవాసులంతా పెద్ద ఎత్తున హాజరై బొనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టాక్ ఆవిర్భావం నుండి ప్రతి కార్యక్రమాన్ని వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవితకు వారు కృతఙతలు తెలిపారు.