లండన్‌లో ఘనంగా “టాక్ బోనాల జాతర”..

681
TAUK
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో బోనాలు జరుపుతున్నప్పటికీ మొట్ట మొదటి సారి పోతురాజు బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు నూతన శోభని తీసుకొనిరావడమే కాకుండా ప్రవాసులందరి ప్రశంశలందుకున్నారు.

Bonalu festivelపోతురాజు వేషదారని ధరించిన శ్రీ.జయ్ రెడ్డి ప్రత్యేకించి అమెరికా నుండి లండన్ వచ్చి బోనాలకు పోతురాజు ఉండాలనే ఆలోచనతో టాక్ సంస్థ నిర్వహిస్తున్న బోనాల వేడుకల్లో పాల్గొని వారి కృషిని ప్రోత్సహించడాన్ని, ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి రత్నాకర్ కడుదుల స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు.

భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు.

Bonalu festivel

స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఉన్నట్టు తెలుకున్నామని, వారి ప్రతి పథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని, ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ “బోనాల” వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసి అభినందించారు.

Bonalu festivel

ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి ప్రేమ్ జీత్ మాట్లాడుతూ.. బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తు భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డపై ముందుకు తీసుకెళ్తున్న తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుందని, భారత హై కమీషన్ అన్ని సందర్భాల్లో టాక్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

మరి ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎదో కారణాల వాళ్ళ రాలేక పోయాను కానీ ఈ సారి వచ్చిన తరువాత ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో ఇంతకు ముందు పాల్గొనలేక పోయినందుకు బాధపడ్తున్నాని తెలిపారు. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు.

Bonalu festivel
సంస్థ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపుచేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు మాజీ ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ మరియు ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి – ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు- బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైళ్లల్లో ఇంతటి స్ఫూర్తి నింపి, ముఖ్యంగా టాక్ సంస్థని ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. అమెరికా నుండి వచ్చి పోతురాజు వేషదారంతో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జై రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.

Bonalu festivel

టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాల గురించి, బంగారు తెలంగాణలో ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తు చేశారు.అలాగే బోనాల వేడుకైనప్పటికీ, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా మనందరం చేనేతకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, మన మాజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు.

Bonalu festivel

ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దులను సత్కరించి జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సబ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంశించారు.

టాక్ సభ్యులు స్వాతి బుడగం , నవీన్ రెడ్డి , సుప్రజ పులుసు, సత్య చిలుముల, ప్రవీణ్ వీర, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి ఆద్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని కమిటీ సబ్యులు తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల( జాగృతి యూకే , తాల్, యుక్తా, రీడింగ్ బతుకమ్మ జాతర, హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY),జీయర్ ట్రస్ట్ (జెట్) మరియు ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.

Bonalu festivelఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, టాక్ అడ్వైసరీ చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, అడ్వైసరీ వైస్ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల , శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్ , సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి , మమతా జక్కి, శ్రీ శ్రావ్య,శైలజ ,శ్వేతా మహేందర్ , శ్రీ లక్ష్మి , శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం ,నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -