శ్రీముఖి, గీతా మాధురిల కొంపముంచిన బిగ్ బాస్ టాటూ

414
Biggboss3 telugu
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. సింగర్ రాహుల్ సిప్లింగజ్ సీజన్ 3 విజేతగా నిలిచారు. చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల చెక్కు, ట్రోఫిని అందుకున్నారు. కాగా బిగ్ బాస్ 3 కప్ శ్రీముఖి గెలుస్తుందని మొదటి నుంచి అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ , శ్రీముఖి గొడవల వల్ల రాహుల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఎక్కువ ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2,3లలో రన్నరప్ గా ఇద్దరు మహిళలే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు..

వీరిద్దరూ ఓడిపోవడానికి ఆ ఒక్కటే కారణం అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంతకి ఆ ఒక్క విషయం ఏంటంటే బిగ్ బాస్ పచ్చబొట్టు. బిగ్ బాస్ 2లో కూడా గీతా మాధురి పర్మినెంట్ టాటూ వేయించుకుంది. హౌస్ లో బాబుగోని నామినేషన్స్ నుంచి బయటపడాలంటే గీతా మాధురి పచ్చబొట్టు వేసుకోవాలని సూచించారు.

దీంతో ఆలోచించకుండా టాటూ వేయించుకుంది గీతా మాధురి. ఇక సీజన్ 3లో కూడా అదే రిపీట్ అయ్యింది. వరుణ్ సందేశ్ నామినేషన్స్ లో నుంచి బయటపడాలంటే శ్రీముఖి టాటో వేసుకోవాలని చెప్పారు బిగ్ బాస్. శ్రీముఖి కూడా ఏం ఆలోచించకుండా టాటో వేసుకోవాడానికి రెడీ అయిపోయింది. ఈ ఇద్దరి విషయంలో ఆ టాటోనే కొంపముంచిందని చెప్పుకుంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. అయితే గత సీజన్‌లో గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకోవడం.. రన్నరప్‌గా నిలివటాన్ని ప్రస్తుత సీజన్‌తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -