KeedaaCola:నాయుడిగా తరుణ్‌భాస్కర్‌

37
- Advertisement -

తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో చేస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ ని రివిల్ చేశారు. చేతిలో గన్ నోట్లో సిగరెట్ తో వైలెంట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ లుక్ సర్ప్రైజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో ‘శ్వాస మీద ధ్యాస’ అనే క్యాప్షన్ ఆసక్తికంగా వుంది.

Also Read: మహేష్ మూవీకే ఎందుకిలా.. ?

దీంతోపాటు ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. జూన్28 ‘కీడా కోలా’ టీజర్ విడుదల చేస్తున్నారు. అలాగే తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఐదేళ్లను పురస్కరించుకుని జూన్ 29న ఎంపిక చేసిన థియేటర్లు & క్లబ్‌లలో రీరిలీజ్ చేస్తున్నారు. ”28న టీజర్ చూసి, 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి. చూసుకుందాం” అని మేకర్స్ తెలియజేశారు. కీడా కోలా చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.

Also Read: భోళాశంకర్ నుంచి బిగ్ అప్ డేట్

- Advertisement -