ఈ నగరానికి ఏమైంది… ఫస్ట్ లుక్

268
Tarun Bhasker Ee Nagaraniki Emaindi
- Advertisement -

గతేడాది పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ ఆల్‌ టైమ్‌ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. నేషనల్‌ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా పలు భాషల్లో సైతం రీమేక్‌కు రెడీ అవుతోంది.

తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు

తాజాగా సినిమా టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు.  నీ గ్యాంగ్‌తో రా థియేట‌ర్‌కి, చూస్కుందాం అనే క్యాప్ష‌న్‌తో న‌లుగురు కుర్రాళ్ళ‌ని టాప్ యాంగిల్ నుండి చూపించారు. సినిమా తీయాల‌నే త‌ప‌న‌తో న‌లుగురు కుర్రాళ్ళు ప‌డే వేద‌న‌,సమాజంపై సినిమా ప్రభావం ఎలా ఉంది ఎలా ఉంటుందనే కథతో సినిమా తెరకెక్కుతుందని హింట్ ఇచ్చేశాడు తరుణ్ భాస్కర్‌.

Tarun Bhasker Ee Nagaraniki Emaindi

ఇవాళ తొలి టెస్ట్‌ స్క్రీనింగ్‌ నిర్వహించామని..సినిమాకు మంచి స్పందన వస్తోందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

- Advertisement -