భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం దిగుమతి సుంకాలను రద్దు చేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు ఎంపీలు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు అక్రమమైనవని, అమెరికా కార్మికులు, వినియోగదారులు మరియు భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్రంగా హానికరమని వారు పేర్కొన్నారు.
డెబొరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం, ట్రంప్ ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఆధారంగా విధించిన సుంకాలను ముగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆగస్టు 27, 2025న భారత్‌పై విధించిన అదనపు 25 శాతం ‘సెకండరీ డ్యూటీలు’తో పాటు, ఇప్పటికే ఉన్న పరస్పర సుంకాలను రద్దు చేయడమే ఈ తీర్మానం లక్ష్యం. ఈ చర్యలతో భారత్ నుంచి వచ్చే అనేక ఉత్పత్తులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది.
నార్త్ కరోలైనా ఎంపీ డెబొరా రాస్ మాట్లాడుతూ, “భారత్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, ఇండియన్–అమెరికన్ కమ్యూనిటీ ద్వారా మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాఢంగా అనుసంధానమై ఉంది. భారత కంపెనీలు ఇక్కడ బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలు సృష్టించాయి” అని తెలిపారు.
టెక్సాస్ ఎంపీ మార్క్ వీసీ మాట్లాడుతూ, “భారత్ కీలకమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి. ఈ అక్రమ సుంకాలు ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్ వినియోగదారులపై అదనపు భారం” అని అన్నారు.
Also Read:అమేజింగ్‌గా మోగ్లీ కంటెంట్!

