టార్గెట్ 300.. బీజేపీకి ఈసారి కష్టమే ?

85
- Advertisement -

2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం సాధించాలని బీజేపీ పార్టీ పట్టుదలగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి కూడా అంతే స్థాయి విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాషాయ పెద్దలు టార్గెట్ పెట్టుకున్నారు. గత ఎన్నికల్లోనూ, 2014 ఎన్నికల్లోనూ అలవోకగా మేజిక్ ఫిగర్ దాటి సీట్లను కైవసం చేసుకున్నా బీజేపీ.. ఏ పార్టీ అండ లేకుండానే అధికారం చేపట్టింది.

అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆ స్థాయి విజయం దక్కుతుందా అనే కష్టమే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ మోడీ మేనియా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. కానీ ఈసారి మోడీ మంత్రం పెద్దగా ఫలించకపోవచ్చనేది కొందరి అభిప్రాయం. నిత్యవసర ధరల విషయంలోనూ, మోడీ ప్రవేశ పెట్టిన కొన్ని విధానాలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉంది. ఇదంత కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. ఇదే టైమ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే పుంజుకుంది. దీనికి ఉదాహరణగా కర్నాటక ఎన్నికలను చెప్పుకోవచ్చు.

Also Read: VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..

ఇదే విధంగా ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈసారి మోడీని ఎలాగైనా గద్దె దించాలని విపక్షాలన్నీ ఏకమౌతుండడం కూడా కాషాయ పార్టీని కొంత కలవర పెట్టె అంశమే. ఈ పరిణామలన్నీ చూస్తే ఈసారి బీజేపీకి సీట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. మరి ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి కమలనాథుల కాన్ఫిడెన్స్ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

Also Read: విపక్షాలకు బి‌ఆర్‌ఎస్ దూరం.. కారణం అదే !

- Advertisement -