ఫిబ్రవరిలో ‘తారామణి’

206
- Advertisement -

డి.వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యస్వంత్ మూవీస్ ప్రెసెంట్స్ సగర్వంగా సమర్పించు చిత్రం ‘తారామణి’ ఈ చిత్రం తమిళంలో చిన్న సినిమా గా విడుదలయ్యి బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం నిర్మాత డి. వెంకటేష్ అందించనున్నారు. హీరోయిన్స్ ఆండ్రియా, అంజలి ప్రధాన పాత్రధారులుగా వసంత్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పూర్తి చేసుకొని ‘ఎ’ సర్టిఫికెట్ పొంది ఫిబ్రవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.

IMG_0187

ఈ సందర్బంగా నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ తమిళంలో తారామణి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. నేటి యువత ప్రవర్తనకు అద్దం పట్టేలా ఈ చిత్ర కథాంశం ఉండడం తో ప్రేక్షకులు బాగా ఆదరించారు. అందుకే ఇంతమంచి మెసేజ్ ఉన్న తారామణి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేయడం జరుగుతోంది.

ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు గర్వాంగాను సంతోషంగానూ ఫీల్ అవుతున్నా… తమిళం లో కంటే తెలుగులో ఇంకా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను… ఈ చిత్రం పేరుకే డబ్బింగ్ అయినా తెలుగు యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది.. ఫిబ్రవరి నెలాఖరులో తారామణి చిత్రాన్ని విడుదల చేయనున్నాము, మిగతా వివరాలు అతి త్వరలో తెలియ పరుస్తామని చెప్పారు.

- Advertisement -